ఎట్లుండే తెలంగాణ-ఎట్లైంది తెలంగాణ.. తొమ్మిదిన్నరేళ్ల ప్రగతిపై కేటీఆర్ ప్రజెంటేషన్

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదన్నరేళ్ల ప్రగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తోంది. ఇందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తాజాగా తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రజెంటేషన్ ఇస్తున్నారు. హైదరాబాద్ ఐటీసీ కాకతీయ హోటల్​లో నిర్వహించిన కార్యక్రమంలో అప్పుడెట్లుండే తెలంగాణ.. ఇప్పుడెట్లయింది తెలంగాణ నినాదంతో కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు.

తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌ వన్‌ రాష్ట్రం. జీఎస్డీపీలో అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రం తెలంగాణ. పేదరికాన్ని అత్యంత తగ్గించిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ 2014లో తలసరి ఆదాయం రూ.1,24,104… 2023లో రూ.3,17,115. జీఎస్డీపీలో 2014లో రూ.5.05 లక్షల కోట్లు… 2023లో రూ.13.27 లక్షల కోట్లుగా ఉంది. 2014లో పేదరికం 13.18 శాతం.. 2023లో 5.8 శాతానికి తగ్గింది. 2014లో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు.. 2023లో 3.5 కోట్ల టన్నులుగా ఉంది. అని కేటీఆర్ తెలిపారు.

మిషన్‌ భగీరథ ద్వారా 58 లక్షల కుటుంబాలకు ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. దాని కోసం రూ.37 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మిషన్‌ భగీరథను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని.. మిషన్‌ భగీరథ స్ఫూర్తితో కేంద్రం కూడా హర్‌ ఘర్‌ జల్‌ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news