హైదరాబాదులో వర్షం మొదలవడంతో GHMC-DRF టీం అప్రమత్తమైంది. ఈ మేరకు ఫోన్ నంబర్లు రిలీజ్ చేసింది. అలాగే.. కాప్రా, ఘట్కేసర్, సరూర్ నగర్, ఉప్పల్, మౌలాలితో సహా ఇతర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షం వల్ల ఇబ్బందులు ఎదురైతే నగర ప్రజలు సహాయం కోసం 040-21111111, 9000113667 నంబర్లకు కాల్ చేయాలని సూచించింది. కాగా, ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
ఇది ఇలా ఉండగా.. హైదరాబాద్ నగరంలోని కర్మన్‌ఘాట్, చంపాపేట్, సంతోష్‌నగర్, ఉప్పల్, తార్నాక, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ, ఆల్విన్‌కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట్, బోరబండ, అల్లాపూర్, మధురానగర్, సనత్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, మైత్రివనం, మైత్రివనం, అమీర్‌పేట, పంజాగుట్ట, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం మేడ్చల్, దుండిగల్‌లో వర్షం కురిసింది. అంతేకాదు.. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పస్టం చేసింది.