సూటుకేసులు మీకు .. అరెస్టులు మాకు – కేటీఆర్‌ సంచలన పోస్ట్‌

-

సూటుకేసులు మీకు .. అరెస్టులు మాకు అంటూ కేటీఆర్‌ సంచలన పోస్ట్‌ చేశారు. హరీష్‌ రావు, బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌ పై కేటీఆర్‌ స్పందించారు. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు… పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు… పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు అంటూ ఆగ్రహించారు కేటీఆర్‌. గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు… ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు అంటూ ఆగ్రహించారు.

ktr

ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు… ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు… ప్రజలపై కేసులు… ప్రజాప్రతినిధులపై కేసులు… కేసులు .. కేసులు .. కేసులు… కాసులు మీకు – కేసులు మాకు అంటూ ఫైర్ అయ్యారు. సూటుకేసులు మీకు .. అరెస్టులు మాకు అన్నారు. మాజీ మంత్రులు మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గార్లతోపాటు మా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,నాయకుల అరెస్ట్ లు అప్రజాస్వామికం..తక్షణం విడుదల చెయ్యాలని డిమాండ్‌ చేశారు. జాగో తెలంగాణ జాగో అంటూ నినాదించారు కేటీఆర్‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news