‘ప్రగతి ప్రస్థానం-ఎట్లుండే తెలంగాణ ఎట్లైంది’ పేరిట పుస్తకం విడుదల

-

తెలంగాణలో తొమ్మిదన్నరేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ కేటీఆర్‌ పుస్తకావిష్కరణ చేశారు. ‘ప్రగతి ప్రస్థానం-ఎట్లుండే తెలంగాణ ఎట్లైంది’ పేరిట పుస్తకం విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పథకాలు ప్రతి గడపకూ చేరాయని అన్నారు. తాము ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పునరుద్ఘాటించారు. తమ పథకాలు సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

“ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే ముందు చాలా మందికి అనుమానాలు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం వస్తే హైదరాబాద్‌, స్థిరాస్తి వ్యాపారం ఎలా ఉండేదో అనుమానాలు ఉండేవి. తెలంగాణ వచ్చి తొమ్మిదిన్నరేళ్లు అయ్యింది. తొమ్మిదిన్నరేళ్లలో కొవిడ్‌, ఎన్నికల వల్ల ఆరున్నరేళ్లు మాత్రమే నికరంగా పరిపాలించాం. ఆరున్నరేళ్లలో మేము చేసిన అభివృద్ధి మీ ముందు ఉంది. చంద్రబాబు హయాంలో ప్రో హైదరాబాద్‌ ఇమేజ్‌ ఉండేది. చంద్రబాబు హయాంలో ప్రో ఐటీ, ప్రో అర్బన్‌ ఉండేది. తెలంగాణ ఏర్పడే నాటికి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో 14వ స్థానంలో ఉండేది. ప్రస్తుతం పంజాబ్‌ను వెనక్కినెట్టి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాం. వృథా నీటి పునర్వినియోగం కోసం నూతన విధానం తీసుకొస్తాం. హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నాం.” అని కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news