సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ జీతం సమయానికి ఇవ్వకపోవడం చాలా చోట్ల గమనిస్తూ ఉంటాము. జీతం ఇవ్వకపోవడం అటుంచితే అన్యాయంగా అనుమానించిన ఉదంతం గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని రానీబా ఇండస్ట్రీస్ నీలేష్ దల్షానియా పని చేసి ఆగిపోయారు. కానీ అప్పటికే అతనికి కంపెనీ నుండి రావాల్సిన జీతం పెండింగ్ లో ఉంది.. తెలుస్తున్న సమాచారం ప్రకారం 17 రోజులకు గాను జీహతం అతనికి రావాల్సి ఉండడంతో ఆఫీసుకు వెళ్ళాడు. ఆఫీస్ కు వెళ్లి రావాల్సిన జీతాన్ని అడిగిన నీలేష్ ను కంపెనీ ఓనర్ విభూతి పటేల్ తన స్టాఫ్ తో దాడి చేయించింది. అలా వదిలేయకుండా… అతడి నోటితో చెప్పులు మోయించి క్షమాపణ చెప్పాలంటూ చాలా దారుణంగా అవమానించారు.
ఈ ఘటన గుజరాత్ లో ఇప్పుడు వైరల్ గా మారింది, ప్రస్తుతం ఈమెపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఇకనైనా యాజమాన్యాలు అర్ధం చేసుకోండి… మీ దగ్గర నెలంతా కష్టపడేది ఆజీతం కోసమే.. వారి శ్రమను గుర్తించి సమయానికి జీతాలు చెల్లించండి.