“ చారాణ కోడికి..! బారాణ మసాలా…!! ”రుణమాఫీపై కేటీఆర్‌ సెటైర్లు

-

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేసిన రుణమాఫీపై కేటీఆర్ సెటైర్లు పేల్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారు…ఊరించి.. ఊరించి..ఏడునెలలు ఏమార్చి చేసిన..మీ రుణమాఫీ తీరు చూస్తే..తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే…“ చారాణ కోడికి..! బారాణ మసాలా…!! ” అంటూ సెటైర్లు పేల్చారు. రుణమాఫీ అయిన రైతులకన్నా..కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అన్నారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..! రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలైనై..!!అంటూ మండిపడ్డారు కేటీఆర్‌.

KTR

అన్నివిధాలా అర్హత ఉన్నా..ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు…రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోడు లేడు… అర్హులైన లబ్దిదారులు.. రుణమాఫీ కాక..
అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు ?అంటూ నిలదీశారు. నలభై లక్షల మందిలో.. మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ?ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా ? అంటూ ఆగ్రహించారు. రెండు సీజన్లు అయినా..రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలే అని ఆగ్రహించారు. జూన్ లో వేయాల్సిన రైతుభరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలే..!! కౌలు రైతులకు.. ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలే..!! అంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version