కెసిఆర్ ను ఎగతాళి చేశారు.. ఈనాడు పేపర్ ను షేర్ చేసిన కేటీఆర్!

-

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎలాంటి ప్రజాసమస్యల నైనా సోషల్ మీడియా వేదికగా నే పరిష్కరిస్తుంటారు. అలాగే ప్రతిపక్షాలకు కూడా అదే వేదికగా కౌంటర్లు కూడా ఇస్తారు. అంతేకాదు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ మధ్య సోషల్ మీడియాలో #askktr అనే ప్రోగ్రాం ని కూడా నడిపిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్ ఇస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 2001లో మేం మాసంలో సింహ గర్జన సభలో కేంద్రాన్ని దారికి తెచ్చి… తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను అప్పటి రాజకీయా నాయకులు ఎగతాళి చేశారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

ప్రత్యేక రాష్ట్రం సాధించి తీరుతాం అన్న ఆయన తెగువను ఎద్దేవా చేశారనీ.. కానీ ఇవాళ ఆయన మాట నిజమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే కాదు.. తెలంగాణను ఇండియాలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకు వచ్చారని ప్రతిపక్షాలకు చురకలంటించారు. అయితే దీనికి సంబంధించిన ఆర్టికల్ 2001లో ఈనాడు న్యూస్ పేపర్ లో ప్రింట్ అయింది. ఆ ఆర్టికల్ ను తాజాగా షేర్ చేస్తే ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version