కామారెడ్డిలో కేసీఆర్ ఎందుకు పోటీ చేశాడో కేటీఆర్ చెప్పాలి : షబ్బీర్ అలీ

-

కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు టికెట్ ఇచ్చింది.. కానీ ఓడిపోయామన్నారు  షబ్బీర్ అలీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తాజాగా మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీలో మైనార్టీలకు మెంబర్ ఇచ్చామన్నారు. హైకోర్టు జిపి వస్తున్నారని కాంగ్రెస్ ఏ పోస్టింగ్ ఇచ్చినా మైనార్టీ కోట ఉంటుందన్నారు. కెసిఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు అంటూ షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఏం పదవులు ఇచ్చిందని.. ఆకాశం మీద ఉమ్మితే మొఖం మీద పడతది అని ఆయన విమర్శించారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ అయ్యా కేసీఆర్ కామారెడ్డికి ఎందుకు వచ్చారు.. నన్ను ఓడిద్దామనుకొని మీ అయ్యా ఓడిపోయాడు. దేవుడు చూస్తాడు కదా.. కామారెడ్డి లో మీ అయ్యా ఎందుకు పోటీ చేశాడు అనేదానికి ఫస్ట్ సమాధానం చెప్పు కేటీఆర్. ఆ తర్వాత మాట్లాడు.. మహమద్ అలీని  ఎమ్మెల్సీ చేసింది కాంగ్రెస్ పార్టీనే. ముందు ముందు అలీయన్స్ ఉంటుందని 2013లో మహమద్ అలీని కాంగ్రెస్ ఎమ్మెల్సీ చేసింది. కేటీఆర్ పిచ్చోడు వాడికి ఏం తెలియదు. మా మద్దతు ఎమ్మెల్సీ అయ్యాడు. బీఆర్ఎస్ లో చాలామంది డబ్బుల కోసమే బతుకుతారని పేర్కొన్నారు. కెసిఆర్, కేటీఆర్ ఇద్దరు రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ  ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనిపించదు అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏ కారణం వల్ల ఓడిపోయారో చెప్పే దమ్ము, ధైర్యం కేసీఆర్, కేటీఆర్ లకు ఉందా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news