నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన నియోజకవర్గంలో పర్యటిస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూనే.. మరోవైపు సోషల్ మీడియా వేదికగా యువతను ఆకర్షిస్తున్నారు. ఇంకోవైపు పలు టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఈ తొమ్మిదన్నరేళ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇవాళ ఆయన నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు.

ఇక టైం దొరికితే చాలు కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు మంత్రి కేటీఆర్. ప్రెస్ మీట్​లు పెట్టి.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే తెలంగాణ 50 ఏళ్లు వెనక్కి వెళ్లిపోవడం గ్యారెంటీ అని అన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి అష్టకష్టాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరు గ్యారెంటీలంటూ ఎన్నికల జిమ్మిక్కులు చేస్తోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news