రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సొంత పార్టీ నేతలపై కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ నేతల రాజ్యం నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. హెలికాప్టర్ ఎక్కాలన్నా వాళ్లే.. వాటిని కొనాలన్నా ఉత్తర తెలంగాణ నాయకులే అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పటి వరకు తాను సొంతంగా ఒక్కసారి కూడా హెలికాప్టర్ ఎక్కలేదని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ సెక్రటేరియట్ పై హెలిప్యాడ్ పెట్టాలని డిమాండ్ చేశారు.
ఏం కావాలన్న ఉత్తర తెలంగాణ వైపే ఉన్నాయని మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ మంత్రులు హెలికాప్టర్ లో విరివిగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తక్కువ దూరాలకు, పార్టీ పనులకు కూడా ప్రభుత్వ హెలికాప్టర్లు వినియోగిస్తున్నారని పలువురు మంత్రులపై ఇప్పటికే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇటీవల కొందరు మంత్రులు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్రం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ తన సొంత పార్టీపైనే ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.