బరాబర్ మా అయ్య పేరు చెప్పుకొని వచ్చిన…5 సార్లు గెలిచా – KTR

-

బరాబర్ మా అయ్య పేరు చెప్పుకొని వచ్చిన…యస్, మా అయ్యా పేరు కేసీఆర్… బరాబర్ నేను తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చా అంటూ రేవంత్‌ పై కేటీఆర్‌ ఫైర్ అయ్యారు. నీ లెక్క ఆంద్రోల బూట్లు నాకి, సంచ్చులు మోసి రాలే, 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చినానంటూ కేటీఆర్‌ స్పష్టం చేశారు. కామారెడ్డి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.


KTR strong counter to Revanth

కామారెడ్డిలో బీఆర్ఎస్ ఓటమి తీవ్ర నిరాశ మిగిల్చిందని, అసంబద్ధమైన హామీలిచ్చి కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించారన్నారు. గొర్రె కసాయిని నమ్మినట్లు ప్రజలు రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9వ తేదీన రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు మూడు నెలలు అయ్యింది.. మరీ రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version