తెలంగాణ గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలాగే గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా తండ్రి కెసిఆర్ వద్ద కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో… కెసిఆర్ దగ్గరికి వెళ్లిన కేటీఆర్… పుట్టినరోజు సందర్భంగా తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు.

దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత కూడా కల్వకుంట్ల తారక రామారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇటు… పొన్నం ప్రభాకర్ కూడా మంత్రివర్గం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
తన పుట్టిన రోజు సందర్భంగా తండ్రి కేసీఆర్ నుంచి ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్ https://t.co/zQQKI7CyMU pic.twitter.com/416grrvfJN
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2025