పార్లమెంట్ లో తెలంగాణ వాణి వినిపించాలంటే కేసీఆర్ టీమ్ కే ఓటేయాలి : కేటీఆర్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ఫలితాలు పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా లోక్సభ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తాజాగా సార్వత్రిక ఎన్నికలపై సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ పోస్టు చేశారు.

పార్లమెంట్లో తెలంగాణ గొంతుక బలంగా వినబడాలంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ టీమ్నే గెలిపించాలని, బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. గత 16, 17వ పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు 4 వేల 754 ప్రశ్నలు అడిగారని తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు 1271 మాత్రమే అడిగారని, ఇక బీజేపీ ఎంపీలు 190 ప్రశ్నలు అడిగారని పేర్కొన్నారు. తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేసే సత్తా బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version