రామప్ప శిల్పకళ అమోఘం.. అద్భుతం : కేటీఆర్

-

తెలంగాణ సర్కార్ చారిత్రక సంపదను కాపాడుకునేందుకు కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం రోజున ములుగు జిల్లాలో పర్యటించిన ఆయన.. రామప్ప ఆలయాన్ని సందర్శించారు. తొలిసారిగా ఆలయాన్ని సందర్శించిన కేటీఆర్.. ఆలయ శిల్పకళను చూసి అబ్బురపడ్డారు. రామప్ప శిల్పకళ.. అమోఘం.. అద్భుతం అంటూ కొనియాడారు. ఆలయంలో కాసేపు తిరిగిన కేటీఆర్.. అక్కడి శిల్పకళను పరిశీలించారు.

సరిగమల పొన్నచెట్టును కేటీఆర్‌ స్వయంగా మీటారు, ముగ్గురికి నాలుగు కాళ్లు, సన్నని రంధ్రాలు, దిష్టి స్తంభం, గర్భగుడిలో వెలుతురు, ఆ రోజుల్లోనే హై హీల్స్‌, నీటిలో తేలే ఇటుకలు, సాండ్‌ బాక్స్‌ టెక్నాలజీ, విదేశీయులతో వ్యాపార సంబంధాలు తెలిపే శిల్పాలను గురించి తెలుసుకొని అబ్బురపడ్డారు. ప్రొఫెసర్‌ పాండురంగారావు నీటిలో తేలే ఇటుకల గురించి వివరించి, రామప్ప డోసియర్‌ను బహూకరించారు. టూరిజం గైడ్స్‌ తమ జీవం పెంచాలని వినతి పత్రం సమర్పించగా తప్పకుండా పెంచి పర్మినెంట్‌ చేస్తానని హామీ ఇచ్చారు. రామప్ప ఆలయంలో దిగిన ఫొటోలను ట్విటర్ వేదికగా పంచుకుంటూ తన అనుభవాన్ని పోస్టు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news