బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి..!

-

బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు అందరూ బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి.. కాంగ్రెస్‌ లోకి వెళ్లగా.. తాజాగా మరో కీలక నేత కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి..త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ లోకి వెళ్లనున్నారట. ఈ వార్తల నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కి షాక్ ఇచ్చారు ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి చేరికకు తెర పడింది. నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ప్రత్యక్షమయ్యారు ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ నాయకులు వంశీచంద్ రెడ్డి, మల్లు రవి, నాగం జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి…రావడంతో.. ఆయన కాంగ్రెస్‌ వెళ్లబోతున్నారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version