బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఉదయం మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన పేరు చెప్పకుండా తిట్టింది. దీనికి తాజాగా జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యీ కవితకు కౌంటర్ ఇచ్చారు. “నేను చావు తప్పి.. కన్ను లొట్టబోయినట్టు గెలిచాను. ఎమ్మెల్సీ కవిత కి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కొంత మంది అది కూడా గెలవలేదు కదా. జోహార్లు.. కేసీఆర్ శత్రువుల మాటలను కవిత వల్లే వేస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. పార్టీ నిర్ణయమే అంతిమంగా ఫైనల్. వ్యక్తులుగా ఏదో చేస్తామంటే అది వాళ్ల భ్రమ.. కేసీఆర్ లేకుంటే ఎవ్వరూ లేరు. దాంట్లో ఎలాంటి ఆశ్చర్యం లేదు” అని నవ్వుతూ మీడియాతో మాట్లాడారు జగదీశ్ రెడ్డి.
మరోవైపు నల్గొండలో బీఆర్ఎస్ నాశనం కావడానికి లిల్లీపుట్ నాయకుడే కారణం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నల్గొండ బీఆర్ఎస్ ను నాశనం చేసిన నాయకుడు నా గురించి మాట్లాడుతున్నాడు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఒక్కడే గెలిచాడు. లిల్లిపుట్ నాయకుడు నా గురించి మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి చెందని వ్యక్తి చేత నన్ను తిట్టిస్తున్నారు.మన పార్టీలో ఉండి ఇలా చేయడం దారుణం.. నా మీద కించ పరిచేవిధంగా మాట్లాడిన నాయకుడు నాయి బ్రాహ్మణులను కించ పరిచేవిధంగా మాట్లాడారు. ఆ