త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ : సీఎం రేవంత్ రెడ్డి

-

త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన పద్మశాలి అఖిల భారత మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. జలసౌదలో తన నివాసాన్ని రాజకీయ పార్టీకి అప్పగించారు. అయినా కొండా లక్ష్మణ్ బాపూజీ మరణిస్తే.. ఆ నేతలు సంతాపం కూడా తెలపలేదని గుర్తు చేశారు.

టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు నీడ కల్పించిన ఆయనకే నీడ లేకుండా చేశారని తెలిపారు. బీఆర్ఎస్ కు పురుడు పోసింది కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. టైగర్ నరేంద్రను దృత రాష్ట్ర కౌగిలిలో ఖతం చేశారు. బతకమ్మ చీరల బకాయిలు పెట్టి పద్మశాలిలను బీఆర్ఎస్ నేతలు ఇబ్బందులు పెట్టారు. విద్యుత్ బిల్లులు, ఇతర చాలా అంశాలను తన దృష్టికి వచ్చినప్పుడు పరిస్కరిస్తూ ముందుకెళ్లానని తెలిపారు. రైతన్నలకు ఇచ్చిన ప్రాధాన్యతతోనే నేతన్నలకు కూడా ప్రాధాన్యత ఇస్తానన్నారు. మీరు అడిగింది ఇవ్వడం నా కర్తవ్యం అన్నారు. కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా ఎదుర్కొని ఇబ్బందులు పడినా తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా వచ్చానని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news