వివేక్ వెంకటస్వామి బీజేపీలోనే ఉంటారన్నారు కె.లక్ష్మణ్. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా చక్కటి మ్యానిఫెస్టో ఇచ్చారు… ఆరు నెలలుగా వివేక్ వెంకటస్వామి పై ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉంది, వారు ఖండిస్తూనే ఉన్నారని తెలిపారు కె.లక్ష్మణ్. తెలంగాణ ప్రచారంలో మేం ముందున్నామని… రేపు తెలంగాణ, రాజస్థాన్ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ చేస్తామని ప్రకటించారు.
బిసి సిఎం ప్రకటన పై అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై దాడిని ఖండిస్తున్నామన్నారు. విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని…భౌతిక దాడులను ఖండిస్తున్నామని చెప్పారు. వివేక్ పై ఆర్నెళ్ళ నుంచి మీడియా లో ప్రచారం చేస్తున్నారు…బిజెపి లోనే వివేక్ ఉంటారన్నారు. మేనిఫెస్టో చైర్మెన్ గా ఉండి మంచి మేనిఫెస్టో ఇచ్చారని వివరించారు. రాజ్ గోపాల్ రెడ్డి ఎందుకు మాట మార్చారో ఆయన్నే అడగాలని సెటైర్లు పేల్చారు. తెలంగాణలో జనసేనతో పొత్తు ఉంటుందని.. విదేశాల నుంచి పవన్ కళ్యాణ్ రాగానే.. నిర్ణయం ప్రకటిస్తామన్నారు కె.లక్ష్మణ్.