కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ముఠా తయారయింది – లక్ష్మణ్

-

కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ముఠా తయారయిందని బీజేపీ నేత లక్ష్మణ్ బాంబ్‌ పేల్చారు. రేవంత్ రెడ్డిపై వాళ్ల పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ముఠా తయారయిందన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. బిజెపి పార్టీలో చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు..చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బిజెపి రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్.

laxman targets revanth reddy

అనంతరం డా. లక్ష్మణ్ మాట్లాడుతూ… చేవెళ్ల లో బిజెపి గెలుపు ఖాయమని ఈ రోజు స్పష్టం అవుతుంది..తెలంగాణ ను బి.అర్.ఎస్ దోచుకుని భ్రష్టు పట్టించారని వెల్లడించారు. మోది ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సామాజిక న్యాయమే మూడో సారి మోదీని ప్రధాని చేస్తుంది..ముస్లిం మహిళల ట్రిపుల్ తలాక్ రద్దు చేసి వారి మన్ననలు పొందారని వివరించారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య దేశంలో ట్రైబల్ మహిళను రాష్ట్రపతి చేయడానికి మోది ముందుకు వస్తె కాంగ్రెస్ ఓడించడానికి చూసింది..బిజెపి మినహా పార్టీలు కేవలం కుటుంబం కోసం పని చేస్తున్నారని ఆగ్రహించారు. కానీ మోది మాత్రం దేశ ప్రజలే నా కుటుంబం అంటున్నాడన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version