BREAKING : హైదరాబాద్ లో అధిక ధరలకు అమ్ముతున్న మెడికల్ దుకాణాల లైసెన్సులు రద్దు

-

హైదరాబాద్ లో అధిక ధరలకు అమ్ముతున్న మెడికల్ దుకాణాల లైసెన్సులు రద్దు అయ్యాయి. హైదరాబాద్ లో అధిక ధరలకు విక్రయాలతో పాటు, నాణ్య తలేని మందులు అమ్మకాలు చేస్తున్న పలు మెడికల్ దుకాణాల లైసెన్సులు రద్దు చేసింది స్టేట్ డ్రగ్ కంట్రోల్. కోఠి ఇందర్ బాగ్ లోని గణేష్ ఫా ర్మాస్యూటికల్స్, అంబర్ పేటలోని బయోస్పియర్ ఎంటర్ప్రైజెస్ అంబర్పేట్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేశారు.

అలాగే, నాంపల్లిలో సర్దార్ మెడికల్ హాల్ 3 రోజులు సస్పెండ్ చేశారు స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులు. అక్షయ మెడికల్, జనరల్ స్టోర్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేసింది ఔషద నియంత్రణ మండలి. నాంపల్లిలోని హైదరాబాద్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ వారం రోజుల పాటు అమ్మకాలు నిలిపివేతకు ఆదేశాలు జారీ చేసింది. లంగర్ హౌస్ ఆర్ఎస్ వైద్య సాధారణ దుకాణాలు రద్దు కాగా, చార్మినార్ లోని భారత్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ మూడు రోజుల సస్పెన్షన్ వేటు వేసింది. హుమాయున్ నగర్ లో అల్హమ్రా మెడికల్ అండ్ జనరల్ స్టోర్ 15రోజులు అమ్మకాలు నిలిపిశారు స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఉప్పల్లోని శ్రీ అయ్యప్ప మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, గౌలిగూడలోని గోకుల్ మెడికల్ షాప్ రెండు రోజులు, చార్మినార్ లోని మీరా మెడికల్ షాప్ను వారం మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది స్టేట్ డ్రగ్ కంట్రోల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version