గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

-

గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో తెలంగాణలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి యదావిధిగా పరీక్షలు జరుగనున్నాయి.

గ్రూపు-1 పై సుప్రీంకోర్టులో విచారణ తాజాగా ప్రారంభమైంది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారణ చేపట్టింది. అయితే పిటిషన్ ను న్యాయమూర్తి పాస్ ఓవర్ చేశారు. లిస్ట్ లో పిటిషన్ల పై విచారణ మొత్తం పూర్తి అయ్యాక దీనిని విచారణకు స్వీకరిస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే విచారణ చేశారు. 14 ఏళ్ల తరువాత జరిగే పరీక్షలను కాస్త ఆలస్యం అయినా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించాలని.. జీవో నెం.29ను రద్దు చేయాలని కపిల్ సిబల్ వాదించారు. అయితే ఈ పరీక్షల వాయిదా పై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version