మందుబాబులకు షాక్… నేడు మద్యం దుకాణాలు బంద్

-

మందుబాబులకు షాక్… నేడు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. హైదరాబాద్ లోని మందుబాబులకు నగర కమిషనర్ సీవీ ఆనంద్ షాక్ ఇచ్చారు. ఇవాళ నగరంలోని వైన్ షాపులన్నీ బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలన్నీ మూసివేయాలని ఆదేశించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని సూచించారు.

wine shop

మద్యం దుకాణాలు మాత్రమే కాదు.. కల్లు కాంపౌండ్ లు, బార్‌లు కూడా మూసివేయాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. జంటనగరాల్లో ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య హనుమాన్ జయంతి జరుపుకోవాలని సీపీ సూచించారు. పండుగ పూట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్​ 6వ తేదీన కూడా రాష్ట్రవ్యాప్తంగా వైన్​ షాపులను మూసివేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news