ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ కేకేఆర్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై చతికిల పడింది. షాక్ మీద షాక్ తగిలింది. చెన్నై బ్యాటర్లు విఫలమయ్యారు. వరుసగా క్యూ కట్టారు. ధోని కెప్టెన్ లో మంచి ఫామ్ లోకి వస్తుందనుకున్న చెన్నై జట్టు కేకేఆర్ తో మ్యాచ్ లో కూడా ఓటమి చెందే అవకాశం కనిపిస్తోంది.
చెన్నై ఓపెనర్లు రచిన్ రవీంద్ర 04, కాన్వె 12 పరుగులు చేశారు. రాహుల్ త్రిపాఠి 16, విజయ్ శంకర్ 29 టాప్ స్కోరర్ గా నిలిచాడు. శివం దూబె, అశ్విన్ 1, జడేజా 0, దీపక్ హుడా0, ధోని 1 విఫలం చెందారు. 15.3 ఓవర్ వద్ద కెప్టెన్ ధోని 1 పరుగు చేసి ఔట్ అయ్యాడు. అప్పటికీ చెన్నై జట్టు 75 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత నూర్ అహ్మద్ అరోరా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. 20 ఓవర్లలో 103 పరుగులు చేసింది. శివమ్ దూబె 31 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.