ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఏపీ ఇంటర్ ఫలితాలకు ముహూర్తం అయింది. ఇవాళ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్… ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేయబోతున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఇంటర్ ఫస్టియర్ అలాగే సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేస్తారు నారా లోకేష్.

Www.results.ap.gov.in అనే వెబ్సైట్లో ఇంటర్ ఫలితాలను చూసుకోవచ్చని అధికారికంగా విద్యాశాఖ ప్రకటన చేసింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇవాళ ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేసిన తర్వాత సప్లిమెంటరీ… పరీక్షల తేదీలు కూడా ఖరారు చేసే ఛాన్సులు ఉన్నాయి. అలాగే, మనమిత్ర వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా ఫలితాలు తెలు సుకోవచ్చు. రిజల్ట్స్ కాపీని షార్ట్ మెమోగా వాడుకోవచ్చని విద్యాశాఖ సూచించింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కు కలిపి 10,17,102 మంది పరీక్షలకు హాజరయ్యారు.