Minister Ponguleti – Local body election schedule: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యుల్ పై కీలక ప్రకటన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యుల్ విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. మొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నట్లు కీలక ప్రకటన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి సోమవారం క్యాబినెట్లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామన్నారు. మొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని తెలిపారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
