తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. తాజాగా ఎల్ఆర్ఎస్ పై కీలక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎల్లారీస్ గడువును మరో మూడు రోజులపాటు పొడిగించింది. ఈ మేరకు పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కార్యదర్శి పీకే శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అనధికార స్థలాల క్రమబద్దీకరణను వేగవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25% డిస్కౌంట్తో ఓటీఎస్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి 2020 సంవత్సరంలోనే కెసిఆర్ ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్ పథకం ప్రకటించింది. అప్పుడు దాదాపు 25 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా… గత సంవత్సరం వరకు సుమారు ఎనిమిది లక్షల దరఖాస్తులు పరిష్కారం అయ్యాయి. మిగతా వాటిని కూడా వెంటవెంటనే చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఫిబ్రవరిలో 25% డిస్కౌంట్ తో ఓటిఎస్ కూడా ప్రకటించింది. ఈ గడువు ఏప్రిల్ చివరికి ముగిస్తుండగా… తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ గడువును మరో మూడు రోజులు పెంచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే మే మూడవ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుంది.