తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్‌ ఫస్టియర్‌ నుంచే ఎంసెట్‌ ప్రశ్నలు !

-

తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో మే 7 నుంచి జరిగే ఎంసెట్ లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70% సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తారు. సెకండియర్ లో మాత్రం 100% సిలబస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి వెల్లడించారు. ఎంసెట్ రాయబోయే విద్యార్థులు 2021-22లో ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశారని, కరోనా కారణంగా అప్పుడు 70% సిలబస్ తోనే వార్షిక పరీక్షలు నిర్వహించినందున ఎంసెట్ లో ప్రథమ సంవత్సరంలో అదే సిలబస్ ఉంటుందన్నారు. ఇక ఈ నిర్ణయంపై ఇంటర్‌ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news