తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతర వైభవం కన్నుల పండువగా కనసాగుతుంది. పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్త జనంతో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. భక్తుల పుణ్య స్నానాలతో జంపన్న వాగు కళకళలాడుతుంది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19 వ తేదీ వరకు మేడారం జాతర నిర్వహించనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం జాతర దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. ఈ తరుణంలో సమ్మక్క, సారక్క జాతర కోసం అక్కడ అధికారులు ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు.
ఇవాళ ఆదివారం సెలవు కావడంతో భక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పసుపు, కుంకుమలతో వన దేవతలకు పూజలు చేసి బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో మేడారం పరిసరాలు ప్రస్తుతం రద్దీగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి అధికారులు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. భక్తులందరూ కరోనా నియమ, నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని వారు విజ్ఞప్తిని చేస్తున్నారు.