ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో మూసి కూల్చివేతలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 15000 ఇండ్లను గుర్తించిన రేవంత్ రెడ్డి సర్కార్… మార్కింగ్ కూడా పెట్టింది. చాదర్ఘట్ లాంటి ప్రాంతంలో కూల్చివేతలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే దీన్ని బాధితులు అలాగే గులాబీ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో మూసి పరివాహక ప్రాంత ప్రజలకు మధుయాష్కి గౌడ్ అండగా నిలుస్తున్నారు. రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా… మధు యాస్కి రంగంలోకి దిగారు. మీ ఇంటి పైన ఒక్క గడ్డపార వేటు కూడా పడదు… జెసిబి ప్రోక్లైనర్లు కూడా రావని ప్రకటించారు. ఒకవేళ బుల్డోజర్లు వచ్చిన కోర్టులో కేసు వేసి మీ ఇండ జోలికి ప్రభుత్వం రాకుండా… కొట్లాడుతానని ప్రకటించారు. ఇవాల్టి నుంచి మీరు ప్రశాంతంగా నిద్రపోండి అని మధు యాస్కీ కోరారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం చోటుచేసుకుంది.