15 సెకన్లలో ఒవైసీ బ్రదర్స్‌ అడ్రస్ లేకుండా చేస్తా – నవనీత్ కౌర్

-

15 సెకన్లలో ఒవైసీ బ్రదర్స్‌ అడ్రస్ లేకుండా చేస్తానని హైదరాబాద్ బ్రదర్స్ కు బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్.. అనంతరం మాట్లాడారు. ఒవైసీ బ్రదర్స్ ను టార్గెట్ చేస్తూ…గతంలో 15 నిమిషాల్లో తరమికొడతామంటూ అక్బరుద్దీన్ చేసిన కామెంట్లకు ఆమె కౌంటరిచ్చారు.

Maharashtra MP Navneet Kaur Strong Warning To Owaisi

15 నిమిషాలు కాదు 15 సెకన్లలో అడ్రస్ లేకుండా చేస్తామంటూ నవనీత్ కౌర్ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మరో పాకిస్థాన్ కావొద్దు.. అలా కాకుండా ఉండాలంటే బీజేపీ అభ్యర్థి మాధవీ లతను గెలిపించాలన్నారు బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్. అయితే..ఎంపీ నవనీత్ కౌర్‌కు అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. 15 సెకన్లు ఎందుకు తీసుకుంటున్నారు…గంట సమయం తీసుకోండి…ముస్లింలను ఏం చేస్తారో చేయండన్నారు. అధికారమంతా మీ దగ్గరే ఉంది…మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news