బీసీల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : మహేష్ కుమార్ గౌడ్

-

రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని నేను అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఉత్తర భారతదేశంలో అగ్రవర్ణాలకు దీటుగా కుల గణన జరగాలని దేశంలో ఉన్న ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం జరగాలని భారత్ జోడో నుండి చాటుతున్న మహానుభావుడు రాహుల్ గాంధీ. అందుకే చంపేస్తామని బెదిరిస్తున్నారు. బీసీల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. రాహుల్ గాంధీ చెప్పినట్టు జిస్కి జిత్ని అబాధి , ఉస్కి ఉత్ని బాగేదారి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS ఎందుకు 42 శాతం నుండి 23 శాతంకు బీసీ కోటా తగ్గించారో ముందు సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు.

ఒక బీసీ బిడ్డను మీ రాష్ట్ర అధ్యక్షునిగా చేసే దమ్ము ఉందా.. బీజేపీ ఆక్టీవ్ గా పనిచేసే బీసీ బండి సంజయ్ ని ఎందుకు తొలగించారు. రేవంత్ రెడ్డికి బీసీ కుల గణన అంశంపై కమిట్మెంట్ ఉంది. రేవంత్ రెడ్డి , నేను ,పొన్నం ప్రభాకర్ అంత రాహుల్ గాంధీ సైనికులం. బీసీ కుల గణన జరగనిదే ఎన్నికలకు పోము అని చర్చిస్తునం. బీసీ కుల గణన కాంగ్రెస్ పేటెంట్. సీతక్క, ప్రభాకర్ మేము ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ ఆలోచన తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పాం. కానీ బీసీ ల రిజర్వేషన్లు తగ్గించింది మీరు కాదా కేటీఆర్ అని అడిగారు మహేష్ కుమార్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news