హైడ్రా, మూసి ఓ మహా యజ్ఞం.. అది ఆగదు అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హైడ్రా ఆపితే హైదారాబాద్ మరో వయనాడ్ అవుతుంది అని అన్నారు. ఇకపై హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తాం. ప్రభుత్వ స్థలాలు అక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం. మా కుటుంబసభ్యులు కబ్జా చేసిన కూల్చేయండి అని ఆయన పేర్కొన్నారు.
అలాగే రుణ మాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు మాట తప్పారు. సవాలు విసిరి వెనక్కి తగ్గారు. మూసి సుందరీకరణ పై ఇంకా డి.పి.అర్. సిద్ధం కాలేదు. నిధులు ఎలా మల్లిస్తాం. అమెరికాలో కేటిఆర్ చదివాడా, లేదా సర్టిఫికెట్ కొన్నాడా అని ప్రశ్నించిన మహేష్ కుమార్.. కేటీఆర్ పై కోపం తో కొండా సురేఖ మాట్లాడారు అని తెలిపారు. కానీ ఆ తర్వాత పీసీసీ సూచన తో వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. త్వరలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ ఉంటుంది. రాష్ట్ర మంత్రి వర్గంలో నిజామాబాద్ కు త్వరలో చోటు కల్పిస్తాం అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.