తుమ్మలది తుమ్మితే.. ఊడిపోయే పదవి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దె ఎక్కిందని…హామీలు నెరవేర్చేందుకు ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు. తెలంగాణలో అరాచక, దుర్మార్గపు పాలన కాంగ్రెస్ చేస్తుందని.. 9 నెలల్లో వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు… ఆ కుటుంబాలకు ఈ ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదని ఆగ్రహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని నిప్పులు చెరిగారు.
సీఎం రేవంత్ కు, మంత్రి తుమ్మల కు మధ్య సమన్వయం లేదు… వరికి బోనస్ తప్పించుకొనే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. అన్ని ప్రభుత్వాల్లో పనిచేసిన తుమ్మల … జూనియర్ cm మంత్రి వర్గం లో మంత్రిగా ఫెయిల్ అయ్యారని ఆగ్రహించారు. తుమ్మల ది తుమ్మితే ఊడి పోయే పదవి… ఆయన పదవి పోతుందని ఇలా మాట్లాడారన్నారు. మంత్రిగా చేతగాని పరిస్థితిలో ఉన్నారు… సొంత జిల్లాలో పంట నష్టం ఇవ్వని దుస్థితిలో తుమ్మల ఉన్నారు…ఏ రాష్ట్రం లో అయిన బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చిన పార్టీ అని వివరించారు. మహారాష్ర్ట, ఉత్తర ప్రదేశ్ లో మా ప్రభుత్వాలు రుణమాఫీ చేశాయని… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీ బట్టి బీజేపీ హామీలు ఇస్తుం దని తెలిపారు.