సూపర్ సిక్స్ అమల్లో భాగంగా మరో కార్యక్రమాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు. సంక్రాంతి నుంచి P-4 కార్యక్రమం అమలు చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. సంక్రాంతి రోజున P-4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని… పేదరికం లేని సమాజం ఏర్పాటు చేసే దిశగా P-4 కార్యక్రమం ఉంటుందని తెలిపారు. డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు చేస్తామని… స్వచ్ఛ సేవకుల కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడించారు.
డ్వాక్రా సంఘాలకు ఎంఎస్ఎంఈల హోదా కల్పిస్తామని.. హామీ ఇచ్చారు. బెజవాడకు అకాల వర్షాలు వచ్చాయి…బుడమేరు పెద్ద ఎత్తున వరద వచ్చిందని తెలిపారు. విజయవాడ అతలాకుతలం అయిందని… గత ప్రభుత్వం బుడమేరు గండ్లను పూడ్చలేదని ఆగ్రహించారు. గొంతు వరకు నీళ్లున్నాయి.. భోజనం, నీళ్లు కూడా ఇవ్వలేకపోయామని.. ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టరేట్లో ఉన్నానని తెలిపారు. వరదపై యుద్దమే చేశామని… స్వచ్ఛ సేవకులు నన్ను అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. వరదల వల్ల అంటు వ్యాధులు రాకుండా అడ్డుకోగలిగామని… స్వచ్ఛ సేవకులు కృషి వల్లే ఇది సాధ్యమైందని వివరించారు చంద్రబాబు.