Kazipet railway station : కాజీపేట రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి భారీగా పొగలు వచ్చాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు…పరుగులు పెట్టారు. ఇక అటు మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు…మంటలు ఆర్పుతున్నాయి.
అయితే..ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి భారీగా పొగలు రావడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అటు హైదరాబాదులోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ బయోటెక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేసవి కాలం ప్రారంభం కాగానే… భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే.. ప్రైవేట్ బయోటెక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.