Tension in Mallareddy Engineering College : మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో ఊహించని షాక్ తగిలింది. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గండి మైసమ్మ లోని MREC క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
నిన్న రాత్రి పెట్టిన స్వీట్ లో పురుగులు వచ్చాయని ఆందోళనకు దిగారు విద్యార్థులు. ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్ లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల ధర్నా నిర్వహించారు. ఇక ఇప్పుడు నిన్న రాత్రి పెట్టిన స్వీట్ లో పురుగులు వచ్చాయని ఆందోళనకు దిగారు విద్యార్థులు. దీంతో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.