మర్రి రాజశేఖర్ రెడ్డికి మల్కాజిగిరి టికెట్ ఖరారు అయిందని వార్తలు రావడంతో…మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరి లో పండుగ వాతావరణం.. దసరా పండగ వాతావరణం అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. ఇక్కడ లక్ష ఓట్ల మెజార్టీ రావాలని కోరారు. సినిమా చూపించారు. ఇది ట్రైలర్ మాత్రమే.. రాబోయే రోజుల్లో మంచి సినిమా చూపిస్తామని హెచ్చరించారు.
బీఆర్ ఎస్ అంటే రామ రాజ్యం… రాముడు వచ్చాడు.. రాజేశేకరుడు వచ్చాడు….రావణాసురుడుని కాల్చి వదిలి పెడతాం.. దసరా రోజు ఆ రావణాసురుడిని కాల్చుడేనంటూ మైనంపల్లికి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటే మోసకారులు.. ఎంపీగా గెల్చి నియోజకవర్గంకు ఏం చేయలేదని.. ఇక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ అండగా ఉన్నాడన్నారు మల్లారెడ్డి. క్రమ శిక్షణ తప్పితే బిఆర్ఎస్ నుంచి డిస్మిస్ అని…రాముడు లాంటి వాడు రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఎన్నో బాధలు పడ్డాం… ఇప్పుడు బాధలు పడాల్సిన అవసరం లేదని… కాంగ్రెస్ వాళ్లకు మల్లన్న సినిమా చూపిస్తానని హెచ్చరించారు. నడుచుకుంటూ వచ్చిన అక్కల కాళ్ళు మొక్కుతానని.. మీ పగ తీర్చుకోండి… బీఆర్ఎస్ కు ఓట్లు గుద్ది గుద్ది వదలాలన్నారు. కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మొద్దు…కేసీఆర్ ఆసరా పెన్షన్లు పెంచుతా అని చెప్పాడని గుర్తు చేశారు.