చంద్రబాబుపై మల్లారెడ్డి హాట్ కామెంట్స్.. వరదల్లో రియల్ హీరో అంటూ !

-

mallareddy comments on chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.. వరదల్లో రియల్‌ హీరో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడంటూ పేర్కొన్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ…. నేను బీఆర్‌ఎస్‌ పార్టీ మారలేదన్నారు. సమయం వచ్చినప్పుడు చెబుతానని తెలిపారు.

mallareddy comments on chandrababu

ఏపీలో భారీ వర్షాలు విజయవాడను అతలాకుతలం చేసినా 74 సంవత్సరాల వయస్సులో చంద్రబాబు ప్రజల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి. తెలంగాణను తిరిగి కేసీఆర్, కేటీఆర్ అభివృద్ది చేస్తారన్నారు తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version