మోదీ ఎఫెక్ట్.. వెడ్డింగ్ డెస్టినేషన్ మార్చేసిన రకుల్-జాకీ

-

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్సింగ్, బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ నెల 22వ తేదీన పెళ్లిపీటలెక్కనున్నట్లు కొంతకాలంగా నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మిడిల్ ఈస్ట్లో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్లాన్ కూడా చేసుకున్నారట. కానీ తాజాగా వీరి వెడ్డింగ్ డెస్టినేషన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తొలుత రకుల్-జాకీ మిడిల్ ఈస్ట్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకున్నారట. కానీ ప్రధాని మోదీ ఇటీవలే ఫారిన్లో వివాహాలు చేసుకోవాలనుకునే భారతీయ యువ జంటలకు కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. ‘మేక్ ఇన్ ఇండియా’ లాగే ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ అనే పరంపర ప్రారంభం కావాలని ప్రధాని పిలుపినిచ్చారు. ఈ మేరకు రకుల్-జాకీ కూడా తొలుత విదేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలకున్నా మోదీ పిలుపు మేరకు తమ నిర్ణయం మార్చుకుని గోవాలో పెళ్లి ప్లాన్ చేసుకున్నట్లు రకుల్‌, జాకీ సన్నిహిత వర్గాలు తమకు చెప్పినట్లు ఓ మీడియా సంస్థ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news