టీఎస్ ఆర్టిసిలో పలు సంస్కరణలు

-

ఓవైపు అప్పుల భారం, మరోవైపు పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఆర్టీసీని గాడిన పడేయడానికి యాజమాన్యం ఎన్ని నిర్ణయాలు తీసుకున్న పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. రోజువారీగా పెరుగుతున్న డీజిల్ ధరలకు తోడు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు సకాలంలో రాకపోవడంతో వేతనాలు కూడా సరైన సమయానికి చెల్లించలేని దుస్థితికి చేరుకుంది టీఎస్ ఆర్టీసీ.

అయితే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు సంస్థ ఎండి సజ్జనార్ ఎన్నో సంస్కరణలు అమల్లోకి తెచ్చారు. దీంతో ఇప్పటికే పలు డిపోలు లాపాల్లోకి వచ్చాయి. టిఎస్ఆర్టిసి ఎండిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్నున్న సజ్జనార్ ఇప్పటివరకు తీసుకువచ్చిన, ఇకపై తీసుకురానున్నకీలక సంస్కరణల వివరాలు ఇవే.. 1. హైదరాబాదులోని 44 పిన్ కోడ్ లలో కార్గో డోర్ డెలివరీ సేవలను అందుబాటులోకి తెచ్చారు. 2. ఆర్టీసీలో ఐ టీమ్స్ ను ప్రవేశపెట్టి డిజిటల్ చెల్లింపునకు వీలు కల్పించారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 60 రోజుల్లో 108 స్లీపర్ బస్సులను తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

3. త్వరలో 300 ఎలక్ట్రానిక్ బస్సులను ప్రారంభించనున్నారు. 4. వివాహాలు, ఇతర శుభకార్యాలకు ఆన్లైన్ ద్వారా బస్సులను కాంట్రాక్టుకు తీసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. 5. అన్ని డిపోలు, బస్ స్టేషన్లలో ఎమ్మార్పీ ధరలకే వస్తువుల విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టారు. 6. తిరుపతికి ప్రత్యేక బస్సులు నడపడంతో పాటు రోజు వెయ్యి మందికి దర్శన టికెట్లను అందజేస్తున్నారు. 7. రాఖీ పండుగ నాడు ఆర్టీసీకి రూ 20.10 కోట్ల ఆదాయం లభించేలా ప్రణాళికలు వేసి విజయవంతంగా అమలు చేశారు. 8. 600 బస్సుల్లో ఆన్లైన్ ట్రాకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version