ప్రయాణికులకు అలర్ట్.. ఈ రైళ్లు నెల రోజుల పాటు రద్దు

-

హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలో పనుల కారణంగా జోన్‌ పరిధిలోని పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దాదాపు నెల రోజుల పాటు రద్దు చేయాలని నిర్ణయించినట్లు. ఈ మేరకు రద్దు కానున్న రైళ్ల వివరాల్ని బుధవారం ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఏంటంటే?

ఆగస్టు 1-31 వరకు గుంతకల్‌-బీదర్‌ (07671), ఆగస్టు 2-సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు బోధన్‌-కాచిగూడ (07275) రైలు, కాచిగూడ-గుంతకల్‌ (07670) ఆగస్టు 2-సెప్టెంబర్‌ 1, కాచిగూడ-రాయచూర్‌ (17693) ఆగస్టు 1-31, ఆగస్టు 1-31వ తేదీ వరకు రాయచూర్‌-గద్వాల్‌ (07495), గద్వాల్‌-రాయచూర్‌ (07495) ఆగస్టు 1-31 రైలును రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

 

ఇక ఆగస్టు 1-31 నుంచి రాయచూర్‌-కాచిగూడ (17694), కాచిగూడ-నిజామాబాద్‌ (07596), నిజామాబాద్‌-కాచిగూడ (07593), మేడ్చల్‌-లింగంపల్లి (47222), లింగంపల్లి-మేడ్చల్‌ (47225), మేడ్చల్‌-సికింద్రాబాద్‌ (47235), సికింద్రాబాద్‌-మేడ్చల్‌ (47236), మేడ్చల్‌-సికింద్రాబాద్‌ (47237), సికింద్రాబాద్‌-మేడ్చల్‌ (47238), మేడ్చల్‌-సికింద్రాబాద్‌ (47242), సికింద్రాబాద్‌-మేడ్చల్‌ (47245) రైళ్లు రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాలు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలను సురక్షితంగా చేరుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news