జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం సృష్టిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు పేరుతో మోసం చేసిన రాజకీయ నాయకులారా ఖబర్దార్ అంటు భారత కమ్యూనిస్టు పార్టీ ,తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ వైరల్ అవుతుంది.
దళితబంధు పేరిట అమాయక ప్రజల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మాజీ ప్రజాప్రతినిధులు తిరిగి డబ్బులు ఇవ్వాలని లేనిపక్షంలో ప్రజల చేతుల్లో శిక్ష తప్పదని మావోయిస్టుపార్టీ అధికార పార్టీ ప్రతినిధి జగన్ పేరిట లేఖ కలకలం రేపుతుంది. లేఖలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన మండల, జిల్లాస్థాయి మాజీ ప్రజాప్రతినిధుల పేర్లు ఉండడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. మహాముత్తారంలో రాజిరెడ్డి, రాము, కిష్టయ్య, సడువలి, ఆర్.సడువలి, దుర్గయ్య, కాటారంలో జనార్దన్, రాకేష్, రాజు, మహదేవపూర్లో శ్రీనివాసరావు, బాపు, పలిమెలలో తిరుపతి, మల్హర్ లో రాఘవ, శ్రీనివాసరావు, భూపాలపల్లిలో హరిబాబు ప్రజల వద్ద తీసుకున్న లక్షల రూపాయలు తిరిగి ఇవ్వకపోతే శిక్ష తప్పదని లేఖలో హెచ్చ రించారు. దీంతో వారు భయాందోళనకు గురవుతు న్నారు.ఈ లేఖ నిజమా.. నకి లీనా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు