నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయంలో “ఉచిత ఇసుకపై జన ఆనందం” కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటుగా భవన నిర్మాణ కార్మికులు, బిల్డర్లు, నిర్మాణదారులు, ట్రాక్టర్ల యజమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ట్రక్కు ఇసుక ధర రూ.5 వేల నుంచి రూ.6 వేల దాకా ఉండేది. అయినా ఇసుక దొరికేది కాదు. ఇప్పుడు అదే ఇసుక రూ.1000లకు లభ్యమవుతోంది. జగన్ కు 11 సీట్లు ఇచ్చి ప్రజలు తిరస్కరించారు. ఇప్పటికైనా కూటమి పాలనకు వైసీపీ నాయకులు సహకరించాలి అన్నారు.
ఆలాగే ఇసుక విషయంలో వైసీపీ మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్ పాలనలో ఇసుక విషయం పై ఎమ్మెల్యే, ఎంపీలకు మాట్లాడే హక్కు లేదు. జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తే.. చంద్రబాబు గాడిలో పెడుతున్నాడు. ఇసుక ను కొల్లగొట్టి ప్రజల నెత్తిన జగన్ భారం పెట్టాడు. కానీ ఇచ్చిన హామీలను చంద్రబాబు వంద శాతం అమలు చేస్తారు. ఇసుక అధిక ధరల అంతమే చంద్రబాబు పంతం అని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు.