జగిత్యాల గంగారెడ్డి ఇంట్లో మంత్రి శ్రీధర్ బాబుకి ఘోర అవమానం జరిగింది. గంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబుకి ఘోర అవమానం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు మారు గంగారెడ్డి సోదరి రాధ. అసలు రేవంత్ రెడ్డి అనేటోడు మేము చెయ్యవట్టి సీఎం అయ్యాడు అని ఫైర్ అయ్యారు.
గత గవర్నమెంట్‌లో మంచిగా ఉన్నామని ఆమె తెలిపారు. మన గవర్నమెంట్ వచ్చాక భయపడి బ్రతుకుతున్నాం అంటూ హత్యకు గురైన కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి సోదరి రాధ ఆగ్రహించారు. కాగా జగిత్యాల జిల్లాలో హత్యకు గురైన కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. మంత్రి తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ థాకూర్ ఉన్నారు.