Telangana: జూలై 31న భారీగా రిజిస్ట్రేషన్లు..భారీ స్కాం జరిగిందా ?

-

Telangana: తెలంగాణ రాష్ట్రంలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. జూలై 31న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఒక్క రోజే భారీగా రిజిస్ట్రేషన్లు కావడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జూలై 31న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. రోజుకు 20 నుంచి 30 రిజిస్ట్రేషన్ కానీ ఆఫీసుల్లో వందలాది రిజిస్ట్రేషన్లు చోటుచేసుకున్నాయి.

Massive registrations across Telangana state on July 31

మున్సిపల్, గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. డాక్యుమెంట్ రైటర్లే మధ్యవర్తులుగా వ్యవహారం నడిపించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. రాజధాని శివారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు కొన్ని జిల్లాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎసిబి తనిఖీలు చేస్తోంది.

పటాన్‌చెరు, సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై 31వ తేదీ రాత్రి ఏసిబి అధికారులు దాడి చేశారు. డబ్బులను కిటీకిలోంచి పడేసిన సిబ్బంది, షాపులు మూసివేసి పారిపోయారట డాక్యుమెంట్ రైటర్లు. కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. జూలై 31వ తేదీనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 156 మంది సబ్ రిజిస్ట్రార్ల బదిలీ కూడా అయ్యారట.

Read more RELATED
Recommended to you

Latest news