ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మోదీ చాలా పాపులర్. ఇక సోషల్ మీడియాలో మోస్ట్ ఫాలోవుడ్ ప్రధానుల్లో మోదీ ఎప్పుడు టాప్లోనే ఉంటారు. అయితే తాజాగా ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా భారత ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ ఓ సర్వేను నిర్వహించింది.

ఈ సర్వేలో 69 శాతం ఓట్లతో మోదీ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రేడర్‌ (63%) రెండో స్థానంలో ఉన్నారు. 25 మందితో రూపొందిన ఈ జాబితాలో జపాన్‌ ప్రధాని ఫుమియొ కిషిద చివరి స్థానంలో నిలవడం గమనార్హం. గతంలో వెలువడిన సర్వేల్లోనూ ప్రధాని మోదీ ఈజాబితాలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.

వీరే టాప్ 5 దేశాధినేతలు 

  • భారత ప్రధాని మోదీ – 69%
  • మెక్సికో అధ్యక్షుడు – లోపెజ్ ఒబ్రేడర్ – 63%
  • అర్జెంటీనా అధ్యక్షుడు – జేవియర్ మిలి – 60%
  • స్విట్జర్లాండ్ అధ్యక్షుడు – వియోల్ అమ్హెర్డ్ – 52%
  • ఐర్లాండ్ ప్రధాని -సైమన్ హారిస్ – 47%

Read more RELATED
Recommended to you

Latest news