హైదరాబాద్ ప్రజలకు బయటకు రావొద్దని కోరారు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ. ghmc ఆఫీసు లో మంత్రి తలసాని, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ వర్షాలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ మాట్లాడుతూ… జిహెచ్ఎంసి పరిధి పరిస్థితిని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నామని చెప్పారు.
వచ్చిన ఫిర్యాదును అదే రోజు క్లియర్ చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ సమస్య వల్ల కొంత ఇబ్బంది అవుతోందని వివరించారు. వర్షం కురిసిన తరువాత రెండు గంటల సమయం పడుతుందని… జిహెచ్ఎంసి పరిధిలో 2వేలకు పైగా సిబ్బంది ఫీల్డ్ పై ఉన్నారని వివరించారు. 11సెంటిమిటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదు జిహెచ్ఎంసి పరిధిలో అయిందని… ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రండని కోరారు.