Delhi : మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ

-

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ నేతల భేటీ కానున్నారు. ఇవాళ ఉదయం 10.30కు భేటీ కానున్నారు టీపీసీసీ సీనియర్ నేతలు. ఈ నెల 26న చేవెళ్లలో జరగనున్న బహిరంగ సభతో పాటు పలు అంశాలపై చర్చ నిర్వహించనున్నారు. చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేయనున్న కాంగ్రెస్… ఈ నెల 29న వరంగల్‌లో మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేసే ఆలోచనలో ఉంది.

ఆ తర్వాత మహిళా డిక్లరేషన్ కూడా విడుదల చేయా లని ప్రణాళికలు చేయనుంది. మహిళా డిక్లరేషన్ విడుదలకు ప్రియాంక గాంధీ ని ఆహ్వానించనున్న టీ పీసీసీ.. ఇప్పటికే రైతు, యూత్ డిక్లరేషన్లను విడుదల చేసింది. ఇక అటు ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్నారు మాజీమంత్రి చంద్రశేఖర్. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్నారు మాజీమంత్రి చంద్రశేఖర్. మాజీమంత్రి చంద్రశేఖర్ ఇటీవలే బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version