యాదవులకు కేసీఆర్‌ శుభవార్త..గొర్రెల పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధం!

-

 

యాదవులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. రెండో విడత గొర్రెల పంపిణీనీ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేదా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలనుకుంటుంది.

ఇప్పటికే రూ. 121 కోట్లను ప్రభుత్వం విడుదల చేయడంతో రెండో విడతలో ఇప్పటివరకు 8,801 యూనిట్లను పంపిణీ చేసింది. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉండటంతో పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిధులు రాగానే గొర్రెల పంపిణీ చేపట్టనుంది.

ఇది ఇలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26 వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version