అదానీని ITC కోహినూర్ హోటల్లో లిఫ్ట్ దగ్గర కలిశా – మంత్రి పొంగులేటి

-

తెలగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీతో సమావేశంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అదానీని ITC కోహినూర్ హోటల్లో లిఫ్ట్ దగ్గర కలిశానని ఓ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కానీ సమావేశం కాలేదని తెలిపారు. అయితే..తెలగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్‌ పై స్పందించారు కేటీఆర్‌.

Met Adani near lift at ITC Kohinoor Hotel Minister Ponguleti Srinivas Reddy

లిఫ్ట్ దగ్గర కాదు జాతీయ స్థాయిలో లిఫ్ట్ కోసం పొంగులేటి, అదానీని కలిశాడని తెలిపారు కేటీఆర్‌. రాయదుర్గంలో రూ.6000 కోట్ల విలువ గల 84 ఎకరాల భూమి ఉంది.. దాని మీద కొంత మంది పెద్ద పెద్దోళ్ళు కన్నేశారన్నారు. IVRCL అనే కంపెనీ పొంగులేటి దగ్గర ఉంది.. దాన్ని తీసుకోవడానికి అదానీ తహతహలాడుతున్నాడని ఆరోపణలు చేశారు. మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ రైడ్ జరిగి 75 రోజులైనా కనీసం చీమ కుట్టినంత చప్పుడు కూడా చేయడం లేదు….వీటన్నిటి కోసం, జాతీయ రాజకీయాల్లో లిఫ్ట్ కోసమే ఈ కలయికలు అన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version